---Advertisement---

విశాఖ సౌత్‌లో కూటమి కలహాలు.. జనసేన ఫ్లెక్సీల్లో టీడీపీ నేత మిస్సింగ్!

May 9, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న వేళ విశాఖ సౌత్ నియోజకవర్గంలో టీడీపీ–జనసేన మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కనకమహాలక్ష్మి ఆలయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు, ఆహ్వాన పత్రికల్లో టీడీపీ ఇన్‌చార్జ్ సీతంరాజు సుధాకర్ ఫొటోలు, పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జనసేన నేతలు కావాలనే తమ నాయకుడిని పక్కన పెట్టారని టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఈ ఘటనపై సీతంరాజు సుధాకర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. జనసేన నేతల వైఖరిపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు, జనసేన ఎమ్మెల్యే వంశీ మరియు సీతంరాజు సుధాకర్ మధ్య గత కొంతకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోందన్న ఆరోపణలు కూడా మళ్లీ తెరపైకి వచ్చాయి.

విశాఖ సౌత్‌లో ఇరు పార్టీల మధ్య పెరుగుతున్న రాజకీయ విభేదాలు కూటమి సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. జనసేన నాయకులు పొత్తు ధర్మం పాటించడం లేదని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ముఖ్యంగా సీతంరాజు సుధాకర్ ఎంపీ భరత్ వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు ఉండటం, భరత్ కూడా విశాఖలో తన స్వంత వర్గాన్ని బలోపేతం చేస్తుండటంతో అంతర్గత కుమ్ములాటలు మరింత ముదిరాయని స్థానిక టీడీపీ, జనసేన శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

కూటమి అధికారంలో ఉన్నప్పటికీ స్థానిక స్థాయిలో నాయకుల మధ్య సమన్వయం లోపించడం, ఆధిపత్య రాజకీయాలు పెరగడం భవిష్యత్తులో మరిన్ని రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment