---Advertisement---

విశాఖ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కుట్ర – సీపీఎం ఆరోపణ

April 15, 2026

---Advertisement---

గ్రేటర్ విశాఖ (Visakhapatnam) మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను (Government Assets) ప్రైవేట్ సంస్థలకు (Private Organizations) అప్పగించే టెండర్ల ప్రక్రియపై సీపీఎం(CPM) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యలు ప్రజా వ్యతిరేకమని పేర్కొంటూ, వెంటనే టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. విశాఖపట్నంలోని ఏచూరి భవన్‌లో (Yechury Bhavan) నిర్వహించిన మీడియా సమావేశంలో జివిఎంసీ సీపీఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి. గంగారావు (Dr. B. Gangarao) మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) నేతృత్వంలోని ప్రభుత్వం జివిఎంసీ ఆధీనంలో ఉన్న వందల ఎకరాల భూములు, పార్కులు, మార్కెట్లు, స్టేడియంలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

నగరంలో సుమారు 600 ఎకరాలకు పైగా ఖాళీ భూములను టెండర్ల ద్వారా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలనే ప్రణాళిక ఉన్నట్లు తెలిపారు. ముడసరలోవ పార్క్ (Mudasarlova Park), శివాజీ పార్క్ (Shivaji Park) సహా 350కు పైగా కాలనీ పార్కులను 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరా ప్రియదర్శిని ఇండోర్ స్టేడియం, గాజువాక రాజీవ్ ఇండోర్ స్టేడియం, క్రీడా మైదానాలు, కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపాలు, అలాగే పూర్ణా మార్కెట్, కురపం మార్కెట్, జ్ఞానాపురం మార్కెట్ వంటి ప్రజా వనరులను కూడా పీపీపీ(PPP) విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచినట్లు పేర్కొన్నారు.

అయితే ఈ ఆస్తుల్లో చాలా వాటిని గత ప్రభుత్వం మరమ్మత్తులు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. 1955 ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం (Andhra Pradesh Municipal Corporation Act) ప్రకారం మున్సిపల్ ఆస్తులు ప్రజా ప్రయోజనాలకే వినియోగించాల్సి ఉంటుందని, వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం చట్ట విరుద్ధమని సీపీఎం స్పష్టం చేసింది. సంపత్ వినాయకుడి వద్ద ఉన్న మున్సిపల్ క్వార్టర్స్, జివిఎంసీ ప్రధాన కార్యాలయం, స్మశానాలు వంటి ఆస్తులను కూడా ప్రైవేటీకరణలో భాగం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వైఖరిని బహిరంగంగా వెల్లడించాలని సీపీఎం డిమాండ్ చేసింది. టెండర్లను వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించింది. “ప్రతిదీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రభుత్వ అవసరం ఏమిటి?” అని ప్రశ్నిస్తూ, ప్రజా ప్రతినిధుల బాధ్యతలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలా అని ఎద్దేవా చేశారు నాయకులు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment