---Advertisement---

విశాఖ కొండలకు బొడుగుండు కొట్టేస్తున్న కూటమి ప్రభుత్వం – బొలిశెట్టి విమర్శ.

May 16, 2026

---Advertisement---

కూటమి పాలనలో విశాఖపట్నంలో(Visakhapatnam) పెరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై జనసేన (Jana Sena) మాజీ నాయకుడు, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetti Satyanarayana) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సింహాచలం కొండతో (Simhachalam Hill) పాటు ముడసర్లోవ, కంబాల కొండ, పావురాల కొండల్లో జరుగుతున్న తవ్వకాలు, నిర్మాణాలపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జగన్ ప్రభుత్వం (Jagan Government) చేస్తే విధ్వంసంగా ప్రచారం చేసి.. టీడీపీ ప్రభుత్వం చేస్తే అభివృద్ధి అన్నట్టుగా ప్రస్తుతం వ్యవహారం సాగుతోందని ఆయన విమర్శించారు.

కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ప్రభుత్వం రుషికొండపై అప్పటికే ఉన్న పాత హరితా రిసార్ట్స్(Haritha Resorts) త్వలగించి, టూరిజం శాఖ ద్వారా ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టినప్పుడు టీడీపీ(TDP) తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిందని గుర్తుచేశారు. అప్పట్లో రుషికొండను బోడిగుండు చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన వారే, ఇప్పుడు డేటా సెంటర్ పేరుతో పవిత్ర సింహాచలం కొండలు, ముడసర్లోవ ప్రాంతాల్లో తవ్వకాలు జరగడాన్ని సమర్థిస్తున్నారని విమర్శించారు.

అదే విధంగా ప్రైవేట్ రిసార్ట్స్ కోసం ప్రముఖ భౌద్ద క్షేత్రం పావురాల కొండలను ధ్వంసం చేస్తూ దానిని అభివృద్ధిగా చూపించడం ప్రమాదకరమన్నారు. విశాఖ నగరానికి సహజ రక్షణ కవచాలుగా ఉన్న కొండలను నిర్వీర్యం చేయడం వల్ల భవిష్యత్తులో పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కొండల తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసిన బొలిశెట్టి, అవసరమైతే ఈ విధ్వంసాన్ని అడ్డుకునేందుకు నగర ప్రజలంతా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment