---Advertisement---

జిన్‌పింగ్ ఢిల్లీ టూర్‌పై క్లారిటీ.. 7 ఏళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు!

August 25, 2026

Summarize with AI

---Advertisement---

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో(Delhi) బ్రిక్స్(BRICS) శిఖరాగ్ర సమావేశాలు(Summit Meetings) జరగనున్నాయి. ఈ సదస్సుకు సభ్య దేశాల అధినేతలను భారత్(India) ఆహ్వానించింది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) హాజరుకానున్నట్లు సమాచారం ఉండగా.. తాజాగా చైనా అధ్యక్షుడు (China President) షీ జిన్‌పింగ్ (Xi Jinping) కూడా భారత్‌కు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జిన్‌పింగ్ భారీ బృందంతో ఢిల్లీకి రానున్నట్లు రాయిటర్స్(Reuters) వెల్లడించింది. డోక్లాం (Doklam) ఘర్షణ తర్వాత దాదాపు 7 ఏళ్లకు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. దీంతో జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా భారత్-చైనా (India-China) సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్న సమయంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

వచ్చే నెలలో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో జిన్‌పింగ్ పాల్గొననున్నట్లు సమాచారం. ఈ పర్యటన భారత్, చైనా మధ్య సంబంధాల్లో చోటుచేసుకుంటున్న మార్పులకు సంకేతంగా నిలిచే అవకాశం ఉందని రాయిటర్స్ పేర్కొంది. బ్రిక్స్ సమావేశాల కంటే జిన్‌పింగ్ భారత్ పర్యటనపైనే అంతర్జాతీయంగా ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

ఇటీవల భారత్, చైనా మధ్య పలు కీలక చర్చలు జరిగాయి. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) కూడా చైనాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు, ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర కీలక అంశాలపై మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో భారత్, చైనా, రష్యాతో పాటు ఇతర సభ్య దేశాల నేతలు పాల్గొననున్నారు. జిన్‌పింగ్ పర్యటన అధికారికంగా ఖరారైతే.. భారత్-చైనా సంబంధాలతో పాటు బ్రిక్స్ సదస్సు కూడా మరింత ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment