---Advertisement---

‘‘దోషులు ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరు’’… రామ మందిర విరాళాల చోరీ కేసులో యోగి వార్నింగ్..

June 26, 2026

Summarize with AI

---Advertisement---

అయోధ్య(Ayodhya) రామ మందిర (Rama Temple) విరాళాల చోరీ కేసు (Donations Theft Case) దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 8 మందిపై ఎఫ్ఐఆర్(FIR) నమోదు కాగా, నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాలను దుర్వినియోగం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

దేవారియాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT – Special Investigation Team) ప్రాథమిక నివేదిక అందిన వెంటనే పోలీసులు(Police) వేగంగా చర్యలు ప్రారంభించారని తెలిపారు. దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా సాగుతుందని, దోషులు ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరని హెచ్చరించారు.

ప్రజల విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావోద్వేగాలతో ఎవరూ ఆటలాడే అవకాశం ఇవ్వబోమని సీఎం(CM) స్పష్టం చేశారు. రామ మందిరానికి వచ్చే విరాళాలు కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతీక అని, వాటి దుర్వినియోగాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర నిరాశతో రామభక్తులను లక్ష్యంగా చేసుకుని అనవసర ఆరోపణలు చేస్తున్నాయని యోగి విమర్శించారు. అయోధ్య ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఆధారాలు లేని ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైనా ఆరోపణలు చేయాలనుకుంటే, వాటికి సంబంధించిన ఆధారాలను ప్రత్యేక దర్యాప్తు బృందానికి సమర్పించాలని సూచించారు.

సిట్(SIT) దర్యాప్తు పూర్తయ్యాక వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని, ఆ తర్వాత చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని యోగి స్పష్టం చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో రాజకీయ విమర్శలు చేయకుండా, విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలని ప్రతిపక్షాలకు సూచించారు.

ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిపై కేసులు నమోదు కాగా, దర్యాప్తు మరింత వేగవంతంగా కొనసాగుతోంది. సిట్ నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment