ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాజకీయ వేడిమి మరింత పెరుగుతున్న వేళ, కూటమి ప్రభుత్వం వ్యవహారశైలిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగుతున్నారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించే ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై (Professor Nageshwar) నమోదైన కేసులపై జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజా గొంతుకగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కావాలనే కేసులు పెట్టించడం దారుణమని జగన్ విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలపై సమానంగా విమర్శలు చేస్తూ, ప్రతి అంశాన్ని విశ్లేషించే వ్యక్తి నిజం (Truth) మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? అంటూ ప్రభుత్వం తీరుపై జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జంగిల్‌రాజ్‌గా (Jungle Raj) మార్చేశారని ఆరోపించారు.
ప్రతిపక్షాల గొంతును (Opposition Parties Voice) అణిచివేయడానికి పోలీసులు రాజకీయ ఆయుధాలుగా మారిపోయారని జగన్ విమర్శించారు. దాడులు(Attacks), అక్రమ కేసులు(Illegal Cases), వేధింపులతో (Harassment) ఎంతకాలం పాలన కొనసాగిస్తారని ప్రశ్నించారు. అధికార మదంతో వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం ప్రజల సహనాన్ని పరీక్షిస్తోందని అన్నారు. ప్రజలు ఎప్పటికీ ఇవన్నీ భరించరని, ప్రభుత్వ అక్రమాలు, అణచివేతలు, కక్షసాధింపులపై తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
ప్రజల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూనే ఉంటుందని, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో… pic.twitter.com/t1FH8uUsDv
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 24, 2026






