మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం గారి పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం గారి సతీమణిని, కుమారుడు ముద్రగడ గిరిబాబును పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ముద్రగడ పద్మనాభం గారి అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తయ్యే వరకు అక్కడే ఉన్న శ్రీ వైయస్ జగన్, అంతిమయాత్రలో పాల్గొని పాడెను మోసి తన గౌరవాన్ని, అనుబంధాన్ని చాటుకున్నారు.
ఇదిలా ఉండగా, కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణంతో ఆయన రాజకీయ ప్రస్థానంతో పాటు జీవితాంతం పాటించిన విలక్షణమైన ఆలోచనలు కూడా చర్చనీయాంశంగా మారాయి.
తన భార్య పసుపు, కుంకుమలు తొలగించవద్దని, తన భౌతికకాయాన్ని దహనం చేయకుండా ఇంటి ఆవరణలోనే సమాధి చేయాలని ఆయన ముందుగానే కోరిన విషయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.






