---Advertisement---

వైఎస్సార్సీపీ నోటీస్ ఎఫెక్ట్ – వెనక్కు తగ్గిన జావా డిస్కవరీ – మిస్‌లీడింగ్ కంటెంట్ డిలీట్!

May 7, 2026

---Advertisement---

వైఎస్సార్సీపీ లీగల్ నోటీసుల (YSRCP Legal Notices) ప్రభావంతో జావా డిస్కవరీ (Java Discovery) యూట్యూబ్ ఛానల్ వెనక్కి తగ్గింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని (YS Jagan Mohan Reddy) లక్ష్యంగా చేసుకుని ఎర్రచందనం అక్రమాలపై రూపొందించిన ‘ప్లానెట్ కిల్లర్స్’(‘Planet Killers’) డాక్యుమెంటరీలో తప్పుడు సమాచారాన్ని ప్రస్తావించారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారాన్ని ఎలాంటి ధృవీకరణ లేకుండా ప్రసారం చేయడంతో చానల్ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి.

సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి (Udumula Sudhakar Reddy రచించిన ‘బ్లడ్ శాండర్స్’(‘Blood Sanders’) పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో, రచయిత ఎక్కడా ప్రస్తావించని అంశాలను చేర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా జగన్ ఫోటోను వివాదాస్పదంగా చూపిస్తూ రాజకీయ కుట్రకు వేదికగా మార్చారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ అంశంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు పంపింది.

డాక్యుమెంటరీ విడుదలైన వెంటనే టీడీపీ శ్రేణులు విస్తృత ప్రచారం చేపట్టడం కూడా అనుమానాలకు తావిచ్చింది. రాజకీయ ఉద్దేశాలతోనే ఈ కథనాన్ని వాడుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. మరోవైపు రచయిత ఉడుముల సుధాకర్ రెడ్డి కూడా తన పుస్తకంలో లేని విషయాలను డాక్యుమెంటరీలో చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.

ఈ పరిణామాల మధ్య జావా డిస్కవరీ చివరకు డాక్యుమెంటరీని తొలగించడం కీలక మలుపుగా మారింది. దీంతో వైఎస్ జగన్‌పై జరిగిన ప్రచారం తప్పుడు కథనాల ఆధారంగా సాగిందనే విమర్శలు మరింత బలపడ్డాయి. రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఎలా వినియోగిస్తున్నారన్న చర్చ ఇప్పుడు మరింత వేడెక్కుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment