తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత విజయ్(Vijay) ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో (Madras High Court) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ (Karur) తొక్కిసలాట ఘటనలో (Stampede Incident) ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు (Families) ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs) కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సోమవారం హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పు విజయ్ ప్రభుత్వానికి పెద్ద షాక్‌గా మారింది.
గత ఏడాది సెప్టెంబర్ 27న టీవీకే అధినేత విజయ్(Vijay) నిర్వహించిన భారీ ర్యాలీలో జరిగిన విషాదకర తొక్కిసలాటలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. భారీ జనసందోహం, భద్రతా లోపాలపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటన దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో 2025 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ)(SIT) నుంచి కేసును సీబీఐకి(CBI) బదిలీ చేసింది. నిష్పాక్షికంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ర్యాలీ భద్రతా ఏర్పాట్లు, జనసందోహ నియంత్రణ, విజయ్ రాక సమయం, పార్టీ నిర్వాహకులు, స్థానిక అధికారుల మధ్య సమన్వయం వంటి అంశాలపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది.
ఇదిలా ఉండగా ఇటీవల కరూర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల 32 మంది వారసులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాల నియామక ఉత్తర్వులను అందజేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై (Petition) విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను (Government Orders) రద్దు చేస్తూ (Cancelling) కీలక తీర్పు వెలువరించింది. దీంతో బాధిత కుటుంబాలకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల నిర్ణయంపై బ్రేక్ పడగా, విజయ్ ప్రభుత్వానికి ఇది గట్టి రాజకీయ, న్యాయపరమైన ఎదురుదెబ్బగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.








