తమిళనాడు రాజకీయాలు (Tamil Nadu Politics) మరోసారి హీట్ ఎక్కాయి. డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) అరెస్టు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపు 4 గంటల పాటు పోలీసుల అదుపులో ఉన్న ఉదయనిధిని విడుదల చేసిన వెంటనే డీఎంకే(DMK) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (M.K. Stalin) తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి విజయ్(CM Vijay) నేతృత్వంలోని ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. “అహంకారం (Arrogance) వినాశనానికి (Destruction) దారితీస్తుంది. అదే అహంకారాన్ని కొనసాగిస్తే వినాశనం మరింత వేగంగా వస్తుంది” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రముఖ నటి త్రిషపై (Trisha) ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ (Double Meaning) వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే తన ప్రసంగంలో ఎలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయలేదని ఉదయనిధి స్పష్టం చేశారు. 4 గంటల విచారణ అనంతరం పోలీసులు ఆయనను విడుదల చేయడంతో ఈ కేసు రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది.
తమిళనాడు అసెంబ్లీలో (Tamil Nadu Assembly) ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి ఇటీవల విజయ్ ప్రభుత్వంపై వరుస ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కావేరీ జలాల విషయంలో Cauvery Water Issue) రాష్ట్ర హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని, మేకేదాటు ప్రాజెక్టును (Mekedatu Project) అడ్డుకోవడంలో కూడా సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ ఆరోపణలకు సమాధానం చెప్పలేకపోయిన ప్రభుత్వం ప్రజల దృష్టిని కావేరీ సమస్య నుంచి మళ్లించేందుకే అరెస్టు డ్రామా ఆడిందని ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు కేవలం 1 రోజు ముందు ఉదయనిధిని అరెస్టు చేయడంపై కూడా స్టాలిన్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీ సమావేశాలకు (Assembly Sessions) హాజరుకాకుండా అడ్డుకోవాలనే రాజకీయ కుట్రలో భాగంగానే ఈ చర్య జరిగిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని (Democracy) బలహీనపరిచే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఇక డీఎంకే నేతలు కూడా విజయ్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులు, విద్యార్థులు, రైతులు, నిరసనకారుల గొంతు నొక్కేందుకు అరెస్టులను ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని భయపెట్టే ప్రయత్నమే జరుగుతోందని మండిపడ్డారు.
ఉదయనిధి స్టాలిన్ అరెస్టు, విడుదల వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో కొత్త దుమారం రేపింది. కావేరీ జలాల వివాదం, మేకేదాటు ప్రాజెక్టు, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో డీఎంకే-టీవీకే మధ్య రాజకీయ యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.








