---Advertisement---

ఉబర్, రాపిడో విలీనం..? చర్చల వెనుక అసలు ట్విస్ట్ ఇదే!

August 14, 2026

Summarize with AI

---Advertisement---

భారత రవాణా రంగంలో ప్రముఖ రైడ్‌ హెయిలింగ్‌ సంస్థలైన ఉబర్(Uber), రాపిడో(Rapido) విలీనం (Merger) కానున్నాయన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఏడాది మేలో ఉబర్ సీఈఓ (CEO) దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) భారత్ (India) పర్యటన సందర్భంగా ఇరు సంస్థల మధ్య విలీనంపై చర్చలు జరిగినట్లు సమాచారం. భారత మార్కెట్‌లో పెరుగుతున్న పోటీని ఎదుర్కోవడం, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం, వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఉబర్ తన భారత వ్యాపారాన్ని రాపిడోతో విలీనం చేసి, నిర్వహణ బాధ్యతలను రాపిడో యాజమాన్యానికి అప్పగించే ప్రతిపాదన చేసినట్లు సమాచారం. అయితే రాపిడో మాత్రం ఉబర్ భారత వ్యాపారాన్ని నగదు, వాటాల లావాదేవీ ద్వారా కొనుగోలు చేసి, ప్రతిగా ఉబర్‌కు రాపిడోలో మైనారిటీ వాటా ఇచ్చే ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.

అయితే భారత మార్కెట్‌పై (Indian Market) నియంత్రణను పూర్తిగా వదులుకునేందుకు ఉబర్ సిద్ధంగా లేకపోవడంతో ఇరు సంస్థల మధ్య ప్రధానంగా యాజమాన్య హక్కుల విషయంలో విభేదాలు వచ్చినట్లు సమాచారం. దీంతో విలీన చర్చలు ముందుకు సాగలేదని తెలుస్తోంది. ఇప్పటికే 2020లో ఉబర్ ఈట్స్(Uber Eats) వ్యాపారాన్ని జొమాటోకు (Zomato) విక్రయించినప్పటికీ, ప్రధాన రైడ్‌ హెయిలింగ్‌ వ్యాపారంపై (Core Ride-Hailing Business) నియంత్రణను కోల్పోవడానికి ఉబర్ ఆసక్తి చూపలేదని సమాచారం.

ప్రస్తుతం రాపిడో బైక్‌ ట్యాక్సీ విభాగంలో బలమైన స్థానంలో ఉండగా, ఉబర్ క్యాబ్‌ సేవల్లో కీలక పోటీదారుగా కొనసాగుతోంది. ఈ రెండు సంస్థలు విలీనమై ఉంటే భారత రవాణా రంగంలో పోటీ సమీకరణాలు భారీగా మారే అవకాశం ఉండేది. ముఖ్యంగా ఓలాకు గట్టి పోటీ ఎదురయ్యేది.

అయితే విలీనానికి సంబంధించిన వార్తలను రాపిడో ఖండించింది. ప్రస్తుతం ఉబర్, రాపిడో స్వతంత్రంగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు రాపిడోకు పోటీగా ఉబర్ తన బైక్‌ ట్యాక్సీ సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే దాదాపు 220 నగరాలకు ఈ సేవలను విస్తరించిన ఉబర్.. భారత మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment