కర్ణాటకకు (Karnataka) చెందిన బాలమేధావి రిషి శివ ప్రసన్న (Rishi Shiva Prasanna) తన అసాధారణ ప్రతిభతో చిన్న వయసులోనే గుర్తింపు తెచ్చుకున్నారు. 12 ఏళ్లకే పుస్తక రచయితగా(Author), మొబైల్ యాప్‌ల రూపకర్తగా (Mobile App Developer) ఎదిగారు. ఆయన ఐక్యూ 180 అని ప్రచారంలో ఉన్నప్పటికీ, ఈ సంఖ్యకు సంబంధించి నిర్ధారిత ఆధారాలు లేవు.
రిషి ఐదేళ్ల వయసులోనే కోడింగ్ (Coding) నేర్చుకోవడం ప్రారంభించారు. మొదటి తరగతిలోనే తన తొలి పుస్తకాన్ని రాశారు. అనంతరం సైన్స్, అంతరిక్షం, కాల ప్రయాణం వంటి అంశాలపై రచనలు చేసి, ఇప్పటివరకు 8 పుస్తకాలు రాసినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
‘ఐక్యూ టెస్ట్ యాప్ ఫర్ కిడ్స్’ (IQ Test App for Kids), ‘కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్’(Countries of the World), ‘కోవిడ్ హెల్ప్ ఫర్ బెంగళూరియన్స్’ (Covid Help for Bangaloreans) వంటి యాప్‌లను అభివృద్ధి చేశారు. గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ డెవలపర్‌గా (Google Certified Android Developer) గుర్తింపు పొందారు.
రిషి ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2023లో ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’తో(Pradhan Mantri Rashtriya Bal Puraskar) సత్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా ఆయనను అభినందించారు.
విద్య, వైద్యం వంటి రంగాల్లో కృత్రిమ మేధస్సు ఉపయోగపడుతుందని రిషి అభిప్రాయపడుతున్నారు. వాహనాల నుంచి వెలువడే హానికరమైన పొగను శుభ్రమైన గాలిగా మార్చే యంత్రాన్ని రూపొందించాలనే ఆలోచనతోనూ ఉన్నారు.
చిన్న వయసులోనే రచన, సాంకేతికతలో ప్రతిభ చాటుతున్న రిషి ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకం. ఐన్‌స్టీన్‌కు సంబంధించిన ఐక్యూ సంఖ్య కూడా అధికారికంగా నిర్ధారించబడలేదు. కాబట్టి రిషి ఐక్యూ ఆయన కంటే ఎక్కువనే పోలికను వాస్తవంగా పేర్కొనలేం.








