---Advertisement---

శంషాబాద్‌లో రూ.1,000 కోట్ల భూ కుంభకోణం.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు!

May 26, 2026

---Advertisement---

హైదరాబాద్ (Hyderabad) నగర శివారులోని శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) పరిసర ప్రాంతాల్లో భారీ భూ కుంభకోణం (Land Scam) జరిగినట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) మీడియాతో మాట్లాడిన ఆయన.. పెద్దషాపూర్ (Peddashapur) పరిధిలో ఉన్న 180 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని వెల్లడించారు. ఈ భూముల విలువ సుమారు రూ.1,000 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో స్థానిక రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతలకు సహకరించారని ఆయన ఆరోపించారు.

ఈ భూములపై గతంలోనే పూర్తి స్థాయి విచారణ జరిగిందని, అది ప్రభుత్వ భూమేనని (Government Property) స్పష్టం చేస్తూ ఆర్డీవో (RDO) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని హరీశ్‌రావు తెలిపారు. అయినప్పటికీ ఆ అధికారిక ఆదేశాలను పూర్తిగా పక్కనబెట్టి స్థానిక ఎమ్మార్వో (MRO) భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని విమర్శించారు.

ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా సర్కారు భూమిగా నమోదై ఉన్న ల్యాండ్‌ను పట్టా భూమిగా (Patta Land) ఎలా మార్చారో చెప్పాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఒక తహసీల్దార్‌కు ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా ప్రకటించే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన అధికారులే ఇలాంటి కుంభకోణాలకు కారణమవడం అత్యంత ఆందోళనకరమని అన్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బాధ్యులైన తహసీల్దార్‌తో పాటు ఈ భూ వ్యవహారం వెనుక ఉన్న లబ్ధిదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment