---Advertisement---

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షాక్.. పోలీస్ కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్

May 26, 2026

---Advertisement---

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) సంచలనం రేపిన పోక్సో కేసులో (POCSO Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు (Bandi Bhagirath) ఉచ్చు మరింత బిగుస్తోంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో (Chanchalguda Jail) రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌ను విచారించేందుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టు (Medchal Malkajgiri District Court) పోలీసులకు అనుమతి ఇచ్చింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. మంగళవారం 3 రోజుల పోలీస్ కస్టడీకి (Police Custody) అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మైనర్ బాలిక (Minor Girl) పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో బండి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు, సాక్ష్యాలు సేకరించాల్సి ఉందని పేర్కొంటూ నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతితో బుధవారం నుంచి వరుసగా 3 రోజుల పాటు పోలీసులు భగీరథ్‌ను విచారించనున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ కేసు దర్యాప్తును కూకట్‌పల్లి డీసీపీ (Kukatpally DCP) రితిరాజ్ (Rithiraj) ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం కొనసాగిస్తోంది. బాధితురాలు, ఆమె తల్లి నుంచి ఇప్పటికే కీలక సమాచారాన్ని సేకరించిన అధికారులు.. బండి భగీరథ్‌కు సన్నిహితంగా ఉన్న 10 మంది స్నేహితులను కూడా విచారించారు. వారి నుంచి సేకరించిన వివరాలు కేసులో కీలకంగా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ఆరోపణలు రుజువైతే బండి భగీరథ్‌కు మరింత కఠిన శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పోలీస్ కస్టడీ విచారణ కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment