తమిళనాడులోని (Tamil Nadu) ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం (Arunachalam) గిరిప్రదక్షిణ మార్గంలో (Girivalam Route) వరుసగా జరిగిన 2 అత్యాచార ఘటనలు (Rape Incidents) తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం 2 రోజుల వ్యవధిలో ఇద్దరు యువతులపై (Young Women) దారుణాలకు పాల్పడిన ముఠాను పోలీసులు గుర్తించి ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే గిరిప్రదక్షిణ మార్గంలో ఈ ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ నెల 30న ధర్మపురికి (Dharmapuri) చెందిన ఓ వివాహిత తన స్నేహితులతో కలిసి తిరువణ్ణామలైలో (Tiruvannamalai) పౌర్ణమి గిరిప్రదక్షిణకు వచ్చింది. గిరిప్రదక్షిణ పూర్తయ్యాక మిగతా స్నేహితులు తిరుగు ప్రయాణం అవుతుండగా, వివాహిత తన స్నేహితుడితో కలిసి వాహనం ఆపి మాట్లాడుతోంది. అదే సమయంలో మారణాయుధాలతో వచ్చిన ఓ ముఠా వారిని బెదిరించింది. అనంతరం వివాహితను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడింది.
అక్కడితో ఆగకుండా వివాహితతో పాటు ఆమె స్నేహితుడి దుస్తులు కూడా తీసేసి వారిని నగ్నంగా వీడియో (Nude Video) తీశారు. మరుసటి రోజు ఆ వీడియోలను వారికి పంపించి రూ.1 లక్ష ఇవ్వాలని, లేదంటే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. భయాందోళనకు గురైన బాధితురాలు రూ.4 వేలును ఇచ్చి అనంతరం ధర్మపురి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన మరువకముందే మరో రోజు రాత్రి తిరువణ్ణామలై మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి గిరిప్రదక్షిణ చేస్తుండగా కాళ్ల నొప్పులతో అడిఅన్నామలై గ్రామం వద్ద కూర్చుంది. తన స్నేహితుడిని అక్కడికి రావాలని పిలిచింది. అనంతరం ఇద్దరూ ఓ హోటల్లో టిఫిన్ పార్సిల్ తీసుకుని అయ్యంపాలయం బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లారు.
అక్కడ కూడా అదే తరహాలో ఓ ముఠా వారిని అడ్డగించి బెదిరించింది. యువతిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసింది. యువతి చెవికి ఉన్న కమ్మలు లాక్కోవడంతో పాటు వారిని నగ్నంగా వీడియో తీశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు అయింది.
ఈ ఘటనలను అత్యంత సీరియస్గా తీసుకున్న పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. మొత్తం 11 మంది నిందితులను గుర్తించగా, వారిలో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో వాసుదేవన్(Vasudevan), ఆకాష్(Akash), అశ్వనాథశురనై(Ashwanath Shuranai), అప్పు(Appu), హరిహరన్(Hariharan), శర్మ(Sharma), అరుణ్ కుమార్(Arun Kumar), శివగణేశన్తో (Shivaganesan) పాటు ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.








