---Advertisement---

Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు..పూర్తి వివరాలు ఇవే!

July 1, 2026

Summarize with AI

---Advertisement---

కేంద్ర ప్రభుత్వం (Central Government) దేశంలో రహదారి (Road) మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో (Union Cabinet Meeting) మొత్తం రూ.14,115 కోట్ల వ్యయంతో 2 ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఢిల్లీ(Delhi), ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో (Uttar Pradesh) రవాణా వ్యవస్థ మరింత వేగవంతం కావడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఢిల్లీలో అత్యంత కీలకమైన 6 లేన్ల ద్వారకా సొరంగ మార్గం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టును రూ.6,970 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. సొరంగ మార్గం నిర్మాణం పూర్తయిన తర్వాత ఢిల్లీలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విమానాశ్రయం, ద్వారకా, ఇతర ప్రధాన ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

అదే సమావేశంలో ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) కాన్పూర్ నుంచి కబ్రాయ్ వరకు 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే (Access Controlled Highway) నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.7,145 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ హైవే పూర్తయిన తర్వాత ప్రాంతీయ అనుసంధానం మరింత మెరుగుపడనుంది. సరుకు రవాణా వేగవంతం కావడంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలకు కొత్త ఊపు లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఈ 2 ప్రాజెక్టులు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు ఇంధన వినియోగం కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రవాణా వ్యవస్థ (Road Network) మరింత సమర్థవంతంగా మారడంతో లాజిస్టిక్స్ ఖర్చులు (Logistics Costs) తగ్గి దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఆధునిక రహదారి నెట్‌వర్క్‌ను విస్తరించడం, మెరుగైన అనుసంధానాన్ని కల్పించడం, వేగవంతమైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ఆ లక్ష్య సాధనలో భాగంగానే ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment