---Advertisement---

సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. రైతులకు భారీ గుడ్‌న్యూస్

June 16, 2026

---Advertisement---

తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) జోసెఫ్ విజయ్ (Joseph Vijay) రైతాంగానికి భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని రైతులకు(Farmers) సహకార రంగంలో (Cooperative Sector) తీసుకున్న వ్యవసాయ రుణాలను (Agricultural Loans) మాఫీ చేస్తున్నట్లు (Waiving Off) మంగళవారం అధికారికంగా ప్రకటించారు. తాజా నిర్ణయం ప్రకారం ప్రతి రైతుకు రూ.75,000 వరకు ఉన్న పంట రుణాలను 100 శాతం పూర్తిగా మాఫీ చేయనున్నారు. గతంలో అమల్లో ఉన్న రూ.50,000 పరిమితిని పెంచుతూ సీఎం విజయ్(CM Vijay) ఈ బంపర్ నిర్ణయం తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో మొత్తం 14,43,504 మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఇందులో 8.33 లక్షల మంది సన్నకారు రైతులకు రూ.3,599 కోట్ల మేర ఉపశమనం లభించనుండగా, 5.16 లక్షల మంది చిన్నకారు రైతులకు రూ.1,995 కోట్ల మేర రుణ విముక్తి కలగనుంది. ఇతర కేటగిరీలకు చెందిన రైతులు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పథకం ప్రయోజనాలు పొందనున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి (State Financial Situation) క్లిష్టంగా ఉన్నప్పటికీ రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం విజయ్ ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ రుణమాఫీ పథకం (Loan Waiver Scheme) కారణంగా తమిళనాడు ప్రభుత్వ ఖజానాపై మొత్తం రూ.5,932.23 కోట్ల అదనపు భారం పడనుంది.

మే 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 మధ్యకాలంలో సహకార బ్యాంకుల (Cooperative Banks) ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఒకవేళ రైతు తీసుకున్న రుణం రూ.75,000 కంటే ఎక్కువగా ఉంటే వారికి గరిష్టంగా రూ.35,000 వరకు ఉపశమనం కల్పించనున్నారు.

రాబోయే సాగు సీజన్‌లో (Cultivation Season) రైతులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొత్త పంటలు సాగు చేయడంతో పాటు సహకార బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పొందేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం విజయ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతు సంఘాలు(Farmers Associations), విపక్ష పార్టీల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి ముఖ్యమంత్రి ఈ కీలక ఫైలుపై సంతకం చేసినట్లు సమాచారం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment