ఆధ్యాత్మిక విశ్వాసాలు, మిస్టరీ, నేర పరిశోధనలతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం ‘హైందవ’తో(Hindava) బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లూధీర్ బైరెడ్డి (Ludhheer Baireddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ (Samyuktha Menon) కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ (Teaser) ఉత్కంఠభరిత సన్నివేశాలతో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
రంగపురం ఆలయంలోని పది దైవ విగ్రహాలు మాయమవడం, అదే సమయంలో ఓ హత్య జరగడంతో కథలో మిస్టరీ మొదలవుతుంది. విగ్రహాల అదృశ్యానికి, హత్యలకు సంబంధమేంటి? ఈ ఘటనల వెనుక ఉన్న రహస్యం ఏమిటనే ప్రశ్నలతో టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. మూఢనమ్మకాలపై ప్రశ్నలు సంధిస్తూ, తప్పును నిర్ణయించాల్సింది చట్టమేననే భావనను ఆయన పాత్ర ప్రతిబింబిస్తోంది. మరోవైపు, దేవుళ్లు తిరిగి గర్భగుడికి చేరుకుంటారనే ఆధ్యాత్మిక నమ్మకానికి సంబంధించిన సంభాషణలు కథపై ఆసక్తిని పెంచుతున్నాయి.
శ్యామ్ సీఎస్ (Sam C.S.) అందించిన నేపథ్య సంగీతం టీజర్లోని ఉత్కంఠను మరింత పెంచింది. ఆధ్యాత్మిక విశ్వాసాలు, హత్యల మిస్టరీ, పోలీసుల దర్యాప్తు వంటి అంశాల కలయికతో ‘హైందవ’(Hindava) విభిన్నమైన థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విగ్రహాల అదృశ్యం వెనుక రహస్యాన్ని హీరో ఎలా ఛేదిస్తాడనేది సినిమాలో చూడాలి.








