---Advertisement---

రెండు సీట్లు గెలిచినా “100% స్ట్రైక్ రేట్”నా..? జనసేన తర్వాత ఇప్పుడు ఐయూఎంఎల్‌పై కొత్త రాజకీయ చర్చ!

May 9, 2026

---Advertisement---

రాజకీయాల్లో “100% స్ట్రైక్ రేట్ (Strike Rate)” అనే పదం ఇటీవల మరింత ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) జనసేన పార్టీ (Jana Sena Party) 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ(Assembly), 2 లోక్‌సభ (Lok Sabha) స్థానాల్లో అన్నింటిలోనూ విజయం సాధించడంతో ఆ పార్టీ దీనిని భారీగా ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు ఇదే తరహాలో తమిళనాడులో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐ.యూ.ఎం.ఎల్) (Indian Union Muslim League – IUML) పార్టీ కూడా చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడులో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (Secular Progressive Alliance) కూటమిలో భాగంగా ఐయూఎంఎల్ పార్టీ కేవలం రెండు స్థానాల్లో పోటీ చేసి, ఆ రెండు స్థానాల్లోనూ గెలుపొందింది. దీంతో ఆ పార్టీకి కూడా “100% స్ట్రైక్ రేట్” వచ్చినట్టేనని కొందరు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో “అయితే జనసేన పార్టీ మాదిరిగానే ఐయూఎంఎల్‌ను కూడా 100% స్ట్రైక్ రేట్ పార్టీగా పరిగణించాలా?” అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ అంశాన్ని వేరే కోణంలో చూస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం, “100% స్ట్రైక్ రేట్” అనేది సాధారణంగా మొత్తం శాసనసభ స్థానాల్లో పోటీ చేసి, అన్నింటినీ గెలుచుకున్న సందర్భాల్లో ఉపయోగించే పదం. అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం స్థానాల్లో పోటీ చేసి సంపూర్ణ విజయాన్ని సాధించినప్పుడు మాత్రమే దానిని నిజమైన 100% స్ట్రైక్ రేట్‌గా పరిగణించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో గతంలో భారత రాజకీయ చరిత్రలో చోటుచేసుకున్న కొన్ని ఉదాహరణలను విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. 1989 సిక్కిం శాసనసభ ఎన్నికల్లో నార్ బహదూర్ భండారి నేతృత్వంలోని సిక్కిం సంగ్రామ్ పరిషత్ పార్టీ (Sikkim Sangram Parishad Party) రాష్ట్రంలోని ఉన్న మొత్తం 32 స్థానాల్లో పోటీ చేసి 32 స్థానాలనూ గెలుచుకుంది. దీంతో ఆ శాసనసభ “ఏకపక్ష సభ”(One-Sided Assembly)గా మారిపోయింది. ఆ విజయాన్ని అప్పట్లో రాజకీయ వర్గాలు “100% స్ట్రైక్ రేట్”గా అభివర్ణించాయి.

అలాగే 2009లో పవన్ కుమార్ చామ్లింగ్ (Pawan Kumar Chamling) నేతృత్వంలోని సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ (Sikkim Democratic Front – SDF) కూడా రాష్ట్రంలోని ఉన్న మొత్తం 32 స్థానాల్లో పోటీ చేసి 32 స్థానాలను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఘన విజయాన్ని కూడా పూర్తి స్థాయి 100% స్ట్రైక్ రేట్‌గా గుర్తించారు.

ఇలాంటి ఉదాహరణలను ప్రస్తావిస్తూ విశ్లేషకులు చెబుతున్నది ఏమిటంటే, “మొత్తం స్థానాల్లో పోటీ చేయకుండా, కేవలం కూటమి భాగస్వామ్యంగా కొద్దిస్థానాల్లో మాత్రమే పోటీ చేసి గెలిస్తే దానిని 100% స్ట్రైక్ రేట్‌గా పిలవడం సాంకేతికంగా సరైన నిర్వచనం కాదేమో” అనే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) జనసేన పార్టీ (Jana Sena Party) 175 స్థానాలకు గాను కేవలం 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేసి 21 గెలిచింది. అదే విధంగా తమిళనాడులో ఐయూఎంఎల్ 234 స్థానాలకు గాను రెండు స్థానాల్లో పోటీ చేసి రెండు గెలిచింది. ఈ పరిస్థితుల్లో “పోటీ చేసిన స్థానాల ఆధారంగా” మాత్రమే స్ట్రైక్ రేట్‌ను కొలవాలా? లేక “మొత్తం సభ స్థానాల పరంగా” చూడాలా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కొంతమంది రాజకీయ పరిశీలకులు వ్యంగ్యంగా స్పందిస్తూ, “ఇలా చూస్తే రేపు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక్క స్థానంలో పోటీ చేసి గెలిచినా తాను కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించానని చెప్పుకునే పరిస్థితి వస్తుంది” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన, ఐయూఎంఎల్ వంటి పార్టీల విజయాలను ఎలా అర్థం చేసుకోవాలి? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment