---Advertisement---

ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు భారీ ఊరట.. ‘అడ్వాన్స్ టిప్’పై కేంద్రం కీలక నిర్ణయం..!

August 13, 2026

Summarize with AI

---Advertisement---

ఓలా (Ola), ఉబర్(Uber), ర్యాపిడో (Rapido) వంటి రైడ్ యాప్‌లను (Ride Apps) ఉపయోగించే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణం ప్రారంభం కాకముందే ప్రయాణికులను టిప్ (Tip) ఇవ్వాలని కోరే విధానానికి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చెక్ పెట్టింది. ప్రయాణం పూర్తయ్యే వరకు ముందస్తుగా టిప్ అడిగే ఎలాంటి ఫీచర్లు, సందేశాలు లేదా ఆప్షన్లు యాప్‌లలో ఉండకూడదని అన్ని రవాణా అగ్రిగేటర్లను (Transport Aggregators) ఆదేశించింది.

ప్రీ-టిప్పింగ్ విధానం (Pre-Tipping System) వల్ల ప్రయాణికుల నిర్ణయాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. అదనంగా డబ్బులు చెల్లిస్తేనే డ్రైవర్ త్వరగా వస్తారని లేదా మెరుగైన సేవలు అందుతాయనే భావన ప్రయాణికుల్లో కలిగే అవకాశం ఉందని తెలిపింది. మోటార్ వాహనాల అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025లోని (Motor Vehicle Aggregator Guidelines 2025) క్లాజ్ 14.15 ప్రకారం టిప్ అనేది పూర్తిగా ప్రయాణికుడి స్వచ్ఛంద నిర్ణయం మాత్రమేనని స్పష్టం చేసింది.

  1. బుకింగ్ సమయంలో టిప్ అడగకూడదు.
  2. ప్రయాణం ప్రారంభానికి ముందు టిప్ ఇవ్వాలని కోరే అవకాశం ఉండకూడదు.
  3. ప్రయాణం కొనసాగుతున్న సమయంలో కూడా టిప్ కోసం ప్రేరేపించకూడదు.
  4. ప్రయాణం విజయవంతంగా పూర్తయిన తర్వాత మాత్రమే టిప్ ఇచ్చే ఆప్షన్‌ను చూపించాలి.

ఇటీవల కొన్ని రైడ్ యాప్‌లలో ‘అడ్వాన్స్ టిప్’(Advance Tip), ‘చూజ్ యాన్ యాడ్-ఆన్’(Choose an Add-on) వంటి సందేశాలు కనిపిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ముందుగానే టిప్ చెల్లిస్తే డ్రైవర్ త్వరగా రైడ్‌ను అంగీకరిస్తారనే భావన కలిగించే ఈ విధానాలను అరికట్టేందుకే కేంద్రం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రయాణికుల నుంచి అదనపు మొత్తాన్ని వసూలు చేసేలా, క్యాబ్ బుకింగ్, డ్రైవర్ కేటాయింపు, వేచి ఉండే సమయం లేదా సేవా ప్రమాణాలను ప్రభావితం చేసేలా యాప్‌లలో ఎలాంటి ఫీచర్లు లేదా ఆప్షన్లు ఉండకూడదని కేంద్రం స్పష్టం చేసింది.

అదే సమయంలో ప్రయాణికుడు ఇచ్చే టిప్ మొత్తం నేరుగా డ్రైవర్ ఖాతాకే చేరాలని ఆదేశించింది. టిప్ మొత్తంలో అగ్రిగేటర్ సంస్థలు ఎలాంటి కమిషన్ లేదా కోత విధించకూడదని స్పష్టం చేసింది.

వినియోగదారులను తప్పుదోవ పట్టించే లేదా భ్రమకు గురిచేసే టిప్పింగ్ విధానాలు వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019 (Consumer Protection Act, 2019) నిబంధనలకు విరుద్ధమని కేంద్రం హెచ్చరించింది. దీంతో ఆటో, క్యాబ్ అగ్రిగేటర్లు తమ మొబైల్ యాప్‌లు, డిజిటల్ వేదికలను వెంటనే సమీక్షించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫీచర్లను తొలగించాలని ఆదేశించింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment