---Advertisement---

సీజేపీకి మద్దతు తెలిపిన ప్రీతి జింటా.. విద్యార్థుల ఉద్యమంపై చేసిన కామెంట్స్ వైరల్!

July 22, 2026

Summarize with AI

---Advertisement---

విద్యా సంస్కరణల కోసం కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమానికి బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta) మద్దతు ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సీజేపీ(CJP) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలపై స్పందించిన ఆమె.. విద్యార్థుల డిమాండ్లను (Students Demands) ప్రభుత్వం (Government) సీరియస్‌గా తీసుకుని వెంటనే చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అదే సమయంలో శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని ఎలాంటి అనుమానాస్పద శక్తులు లేదా స్వార్థపూరిత వర్గాలు తమ అజెండా కోసం వాడుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తన సోషల్ మీడియా పోస్టులో స్పందించిన ప్రీతి జింటా(Preity Zinta).. ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న ద్వేషపూరిత ప్రచారం, విభజనాత్మక వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. దేశంలోపల, విదేశాల్లో ఉన్న కొన్ని శక్తులు విద్యార్థుల ఆగ్రహాన్ని తమ ప్రయోజనాలకు మలచే ప్రయత్నం చేస్తున్నాయేమోననే అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఈ ఉద్యమం లక్ష్యం విద్యా వ్యవస్థలో సంస్కరణలు సాధించడమేనని, దానిని రాజకీయ లాభాలకు లేదా అరాచకానికి వేదికగా మార్చకూడదని స్పష్టం చేశారు.

తాను ఎప్పుడూ కృషి, ప్రతిభ, సమానత్వాన్ని నమ్ముతానని చెప్పిన ప్రీతి జింటా(Preity Zinta). ప్రజాస్వామ్య వ్యవస్థపై (Democracy System), ప్రభుత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ప్రభుత్వం, విద్యార్థి సంఘాలు పరస్పరం చర్చలు జరిపి సానుకూల నిర్ణయానికి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ యువత భవిష్యత్తు దృష్ట్యా ఈ ఉద్యమంలో ఎలాంటి అనుమానాస్పద అజెండాలకు చోటు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు.

ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) చేపట్టిన నిరాహార దీక్షకు ప్రీతి జింటా బహిరంగంగా మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఆయనతో పాటు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని కోరడమే కాకుండా, ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిరాహార దీక్షను విరమించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం ప్రీతి జింటా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ఆమె అభిప్రాయాలకు పూర్తి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థుల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించాలని ఆమె చేసిన సూచనకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment