మత మార్పిడి (Religion Conversion) తర్వాత ఎస్సీ హోదా (SC-Status) కొనసాగింపుపై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి స్పష్టమైన తీర్పును వెల్లడించింది. హిందూ(Hindu), సిక్కు(Sikh), బౌద్ధ మతాలు (Buddhist Religions) కాకుండా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు షెడ్యూల్డ్ కులాల (Scheduled Castes-SC) (ఎస్సీ) హోదాను కొనసాగించలేరని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ అంశంపై మార్చి 2026లో ఇచ్చిన తీర్పును మార్చాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను (Review Petition) కూడా ధర్మాసనం తిరస్కరించింది.
క్రైస్తవ మతంలోకి (Christian Religion) మారిన వ్యక్తికి ఎస్సీ హోదా(SC-Status) వర్తించదని కోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పు అవసరం లేదని పేర్కొంటూ రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో మార్చి 2026లో ఇచ్చిన తీర్పు యథాతథంగా అమల్లో కొనసాగనుంది.
అయితే, ఇతర మతాల్లోకి మారిన వ్యక్తి తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎస్సీ హోదా పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకోసం 3 కీలక షరతులు తప్పనిసరిగా నెరవేరాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
- వ్యక్తి జన్మతః షెడ్యూల్డ్ కులానికి చెందినవారై ఉండాలి.
- తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాన్ని నిజమైన ఉద్దేశంతో స్వీకరించి ఉండాలి.
- సంబంధిత అసలు కులం ఆ వ్యక్తిని తిరిగి తమ సభ్యుడిగా అంగీకరించి ఉండాలి.
ఈ 3 షరతుల్లో (Three Conditions) ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎస్సీ హోదా పునరుద్ధరణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) చెందిన ఒక కేసులో హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పును సమర్థించిన ధర్మాసనం.. రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించడం ద్వారా మార్చి 2026లో వెలువడిన తీర్పే అమల్లో కొనసాగుతుందని మరోసారి క్లారిటీ ఇచ్చింది.








