---Advertisement---

మహేష్‌ బాబు బర్త్‌డే స్పెషల్‌.. ‘వారణాసి’ నుంచి రుద్ర ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ చేసిన రాజమౌళి.!

August 9, 2026

Summarize with AI

---Advertisement---

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(S.S. Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’(Varanasi). దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై (Durga Arts Banner) భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను రాజమౌళి జెట్ స్పీడ్‌తో పూర్తి చేస్తున్నారు.

కాగా, నేడు సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ సినిమాలో ఆయన పోషిస్తున్న ‘రుద్ర’ (Rudra) పాత్రకు సంబంధించిన పోస్టర్లను రాజమౌళి విడుదల చేశారు. ఈ పోస్టర్లు ఆఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించినవిగా తెలుస్తోంది. ‘రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు’ అనే క్యాప్షన్‌తో రాజమౌళి ఎక్స్‌లో ఈ పోస్టర్లను పంచుకున్నారు.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ‘రుద్ర’గా(Rudra) తన రౌద్రాన్ని చూపించిన మహేశ్ బాబు.. తాజాగా విడుదలైన పోస్టర్లలో లాంగ్ హెయిర్, గడ్డం, మీసాలతో పూర్తి మాస్, రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్‌లో సూపర్ స్టార్ మరింత ఉబర్ కూల్‌గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

అయితే ‘వారణాసి’ సినిమాలో మహేశ్ బాబు రుద్ర, శ్రీరాముడిగా(Lord Rama) ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేశ్ బర్త్‌డే సందర్భంగా శ్రీరాముడి లుక్‌ను(Lord Rama Look) కూడా విడుదల చేస్తారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ రాజమౌళి మాత్రం శ్రీరాముడి లుక్‌ను విడుదల చేయకుండా రుద్రకు సంబంధించిన పోస్టర్లతోనే అభిమానులకు ట్రీట్ ఇచ్చారు.

దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్‌ను పూర్తి చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment