సీజేపీ (CJP) అధ్యక్షుడు అభిజీత్ దిప్కే (Abhijit Dipke) జంతర్ మంతర్-2 (Jantar Mantar-2) నిరసన కార్యక్రమంపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే జంతర్ మంతర్-2ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో పార్టీ వాలంటీర్ల సమావేశానికి (Party Volunteers Meeting) హాలు దొరకకుండా బీజేపీ(BJP) ఒత్తిడి తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు.
ఇన్స్టాగ్రామ్లో పలువురు జంతర్ మంతర్ సీజన్ 2 ఎప్పుడు ప్రారంభమవుతుందని ప్రశ్నిస్తున్నారని దిప్కే తెలిపారు. వారికి త్వరలోనే జంతర్ మంతర్ సీజన్ 2 ప్రారంభం కాబోతోందని సమాధానం ఇస్తున్నట్లు చెప్పారు.
ఢిల్లీలో (Delhi) 1 వాలంటీర్ల సమావేశాన్ని నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేసిందని, ఇందుకోసం హాలు (Hall) కోసం ప్రయత్నించామని వెల్లడించారు. అయితే హాలు అద్దెకు ఇచ్చేందుకు యజమానులు (Owners) ముందుకు రాలేదని తెలిపారు. పైస్థాయి నుంచి ఒత్తిడి వస్తోందని పలువురు హాలు యజమానులు చెప్పినట్లు దిప్కే పేర్కొన్నారు.
చివరకు ఎంతో కష్టపడి ఒక హాలును బుక్ చేసుకున్నామని(Booked a Hall), దానికి సంబంధించిన రసీదు (Receipt) కూడా తమ వద్ద ఉందని ఆయన చెప్పారు. అయితే మంగళవారం ఉదయం హాలు యజమానులకు బెదిరింపులు వచ్చినట్లు ఆరోపించారు. సీజేపీ సమావేశానికి హాలు కేటాయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారిని బెదిరించినట్లు దిప్కే పేర్కొన్నారు.
ఈ మొత్తం వ్యవహారం వెనుక బీజేపీ ఉందని అభిజీత్ దిప్కే ఆరోపించారు. ఇలాంటి చర్యలు దేశ యువత విషయంలో బీజేపీ భయపడుతోందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని విమర్శించారు. ఒత్తిళ్లు, బెదిరింపులకు తాము భయపడతామని బీజేపీ భావిస్తే అది వారి పొరపాటేనని స్పష్టం చేశారు. అయితే దిప్కే చేసిన ఈ ఆరోపణలపై బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.








