కన్నడ స్టార్ హీరో(Kannada Star Hero) దర్శన్ (Darshan) ప్రధాన నిందితుడిగా ఉన్న రేణుకాస్వామి (Renukaswamy) హత్య కేసులో (Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్ (Pradosh) అప్రూవర్‌గా (Approver) మారేందుకు 11 పేజీల క్షమాభిక్ష పిటిషన్ (Petition) దాఖలు చేశాడు. హత్యకు సంబంధించిన పలు కీలక విషయాలను కోర్టు ముందు వెల్లడించినట్లు సమాచారం.
పవిత్ర గౌడకు (Pavithra Gowda) అశ్లీల సందేశాలు పంపాడన్న ఆరోపణలతో రేణుకాస్వామిపై దర్శన్, అతని అనుచరులు దాడి చేసినట్లు ప్రదోష్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. పవిత్ర గౌడ కూడా బాధితుడిపై దాడి చేసినట్లు తెలిపాడు. రేణుకాస్వామిని బట్టలు విప్పించి, నైలాన్ తాళ్లు(Nylon Ropes), కర్రలతో తీవ్రంగా కొట్టారని, అనంతరం ఛాతీ, మెడపై కూడా దాడి చేసినట్లు ఆరోపించాడు. తీవ్ర గాయాలతో రేణుకాస్వామి మృతి చెందినట్లు పేర్కొన్నాడు.
హత్య అనంతరం అసలు విషయం బయటకు రాకుండా కట్టుకథ సృష్టించినట్లు ప్రదోష్ ఆరోపించాడు. ఆర్థిక వివాదం కారణంగా రేణుకాస్వామిని తామే హత్య చేసినట్లు పోలీసుల ముందు లొంగిపోయేలా ఇతరులతో కలిసి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపాడు. ఇందుకోసం దర్శన్ రూ.15 లక్షలు ఇచ్చినట్లు, అందులో నాగరాజ్‌కు(Nagaraj) రూ.5 లక్షలు, వినయ్‌కు(Vinay) రూ.10 లక్షలు ఇచ్చినట్లు పిటిషన్‌లో పేర్కొన్నాడు. మృతదేహాన్ని సుమనహళ్లి వద్ద కాలువలో పడేసినట్లు తెలిపాడు.
తనకు తెలిసిన పూర్తి విషయాలను కోర్టుకు వెల్లడిస్తానని, తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని ప్రదోష్ కోరాడు. దర్శన్, ఇతర నిందితుల నుంచి ప్రాణహాని ఉందని, తనను ప్రత్యేక సెల్‌లో ఉంచాలని విజ్ఞప్తి చేశాడు. అన్ని పక్షాల వాదనలు విన్న 59వ సెషన్స్ కోర్టు పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. ప్రదోష్‌తో పాటు రవిశంకర్(Ravishankar),, వినయ్ కూడా అప్రూవర్‌గా మారేందుకు దరఖాస్తు చేసుకోవడంతో దర్శన్, పవిత్ర గౌడకు చట్టపరమైన చిక్కులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.








