---Advertisement---

కేరళ కాదు ‘కేరళం’.. పేరు మార్పు బిల్లుకు లోక్‌సభ ఆమోదం..!

August 11, 2026

Summarize with AI

---Advertisement---

కేరళ (Kerala) రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా (Keralam) మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల తీవ్ర నినాదాలు, ఆందోళనల మధ్యే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదించారు.

సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) రావాలంటూ విపక్ష సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల మధ్యే లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) బిల్లును సభ ముందుకు తీసుకురాగా, సభ్యులు మూజువాణి ఓటుతో(Voice Vote) బిల్లును ఆమోదించారు.

రాష్ట్రం పేరును మలయాళ భాషా (Malayalam Language) ఉచ్ఛారణకు అనుగుణంగా ‘కేరళం’గా (Keralam) మార్చాలని కోరుతూ కేరళ శాసనసభ గతంలోనే ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.

భారత రాజ్యాంగంలోని 1వ షెడ్యూల్‌లో ఉన్న కేరళ పేరును ‘కేరళం’గా సవరించే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. తాజాగా లోక్‌సభ ఆమోదం తెలపడంతో పేరుమార్పు ప్రక్రియలో కీలక ముందడుగు పడింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment